'వైఎస్సార్సీపీ నేతలతో వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్': పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తాడేపల్లి
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ మరియు ప్రజా సమస్యలపై పోరాటాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తూ దిశానిర్దేశం చేశారు.