యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును హత్య చేశానన్న సంతోష్

రిపోర్టర్: గోపి స్థలం: Andhra Pradesh / Telangana

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లు సంతోష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన చెల్లికి జరిగిన అన్యాయమే ఎవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు. హరిబాబును చంపడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, తనకు ఎలాంటి శిక్ష పడకుండా అందరూ పోరాటం చేయాలని ఆ వీడియోలో సంతోష్ అభ్యర్థించారు.