దుబాయ్ పాలకుడి తమ్ముడు షేక్ అహ్మద్ కన్నుమూత
రిపోర్టర్: సునీల్
స్థలం: World
యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తమ్ముడు షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సోమవారం కన్నుమూశారు. 76 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచినట్లు దుబాయ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దుబాయ్లో పది రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తున్నట్లు వెల్లడించారు. దుబాయ్ పోలీసు, పబ్లిక్ సెక్యూరిటీ డిప్యూటీ చైర్మన్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ మృతి పట్ల యూఏఈ ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.