పరిశుభ్రతే పరిశుద్ధతంటూ అడుగులేసిన పుత్తూరు కళాశాల యువత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుత్తూరు
తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ఆవరణలోని పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చంద్రమౌళి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమల వ్యాప్తి అరికట్టవచ్చని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారం ఈ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.