మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్: రూపాయికే అన్లిమిటెడ్ కాల్స్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ తో ముందుకు వచ్చిందని, కేవలం ఒక్క రూపాయి ఖర్చుతోనే ఇరవై నాలుగు రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు డేటా సౌకర్యం కల్పిస్తున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్ ద్వారా ఇతర నెట్వర్క్ల నుంచి కొత్తగా మారే వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు లభిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.