చిరంజీవి విశ్వంభర మూవీ రీరికార్డింగ్ పనులు పూర్తి, త్వరలో రిలీజ్ డేట్

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' రీరికార్డింగ్ పనులు పూర్తయ్యాయి. సంగీత దర్శకుడు గౌర హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఎమోషనల్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లకు మ్యూజిక్ అదిరిపోయిందని మేకర్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటీటీ డీల్స్ ముగియగానే త్వరలో అధికారిక విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.