నకిలీ వైద్యం చేస్తూ పట్టుబడిన బోన్ సెట్టింగ్ క్లినిక్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అర్హత లేకుండా ఎముకల వైద్యం పేరిట దవాఖాన నడిపిస్తున్న ఓ నకిలీ డాక్టర్ గుట్టును అధికారులు రట్టు చేశారు. పట్టణంలో అంకం శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలాంటి వైద్యార్హత లేకుండా ధన్వంతరి హాస్పిటల్ పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు నిర్ధారించుకొని ఆస్పత్రిని సీజ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.