కాగజ్ నగర్‌లో ఐదేళ్ల బాలుర మేనకోడలిపై అత్యాచార యత్నం, ఉద్రిక్తత
రిపోర్టర్: సతీష్
స్థలం: కుమురం భీం ఆసిఫాబాద్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో అభం శుభం తెలియని ఐదేళ్ల మేనకోడలిపై మామిడిపల్లి శశి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంపై ఆగ్రహించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై మహిళలు, స్థానికులు చెప్పులు, చీపుర్లతో దాడికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అతికష్టమ్మీద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.