ఓటీటీలోకి అనకాపల్లి సినిమా: రెండు ప్రముఖ వేదికల్ లో డిజిటల్ స్ట్రీమింగ్

రిపోర్టర్: సతీష్ స్థలం: అనకాపల్లి

నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సాహిదేవ్ హీరోగా నటించిన తాజా తెలుగు సినిమా అనకాపల్లి ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్ గా రెండు ప్రముఖ ఓటీటీ వేదికల్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు సన్ నెక్స్ట్ ఓటీటీల్ లో ఈ చిత్రం మంగళవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఓటీటీ ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.