ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్‌ఘాట్ వద్ద నిరసనలో పాల్గొన్న ఎంపీ వంశీకృష్ణ
రిపోర్టర్: సురేష్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం ఎప్పటికీ ఆగదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం, ఓటు హక్కుల పరిరక్షణ నిమిత్తం చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధ, ప్రియాంక గాంధీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ నిరసనలో తాను భాగస్వామ్యమైనట్లు ఎంపీ వంశీకృష్ణ పేర్కొంటూ ట్వీట్ చేశారు.