బీజేపీపై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్న నాయకులు
రిపోర్టర్: మహేష్
స్థలం: Amaravati
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని ప్రధాని నరేంద్ర మోదీ పంచ తీర్థాల ద్వారా ఘనంగా గౌరవించారని బిజెపి నేతలు స్పష్టం చేశారు. వరప్రసాద్ అనే వ్యక్తి రాసిన పుస్తకంతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. దళిత వర్గాలను తప్పుదోవ పట్టించడానికే ప్రతిపక్షాలు కావాలనే బిజెపిపై సోషల్ మీడియాలో తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.