నర్సింగ్ కళాశాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హుకుం

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని హెచ్చరించారు.