మంగంపేట రైజింగ్ మిల్లుల సమస్యలపై సీఎంకు టీడీపీ నేత వినతి
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేట చిన్న పరిశ్రమలు, రైజింగ్ మిల్లుల సమస్యలను పరిష్కరించి కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచాలని టీడీపీ సీనియర్ నాయకుడు గల్లా శ్రీనివాసులు కోరారు. యువ నాయకుడు గల్లా భాను అవినాష్‌తో కలిసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి వినతిపత్రం అందజేశారు. ముగ్గురాయి సరఫరాలో సమాన విధానం అమలు చేయాలని, విద్యుత్, రవాణా భారం నుంచి మిల్లులను ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.