పెద్దంపేటలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన పెండ్యాల మహేష్
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ దేవర గణపతి యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో డిసిసి అధికార ప్రతినిధి పెండ్యాల మహేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలంతా వినాయక నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, గణపయ్య ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.