మానసిక ఒత్తిడి అంచనా కోసం ఏఐ ఆధారిత వ్యవస్థను ఆవిష్కరించిన నిమ్హాన్స్

రిపోర్టర్: గోపి స్థలం: బెంగళూరు

మారుతున్న జీవనశైలిలో ఒత్తిడిని నియంత్రించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. మానసిక రోగుల సమస్యలను కచ్చితంగా గుర్తించి సరైన చికిత్స అందించేందుకు బెంగళూరులోని నిమ్హాన్స్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఎల్‌జీబీఆర్‌ఐఎంహెచ్ సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 'హెడ్స్‌' సమీక్ష వ్యవస్థను రూపొందించాయి. రెండేళ్ల పాటు పరిశోధనలు చేసి క్లినికల్ వినియోగానికి సిద్ధం చేసిన ఈ నూతన విధానం ద్వారా వివిధ భాషల్లో రోగుల ఒత్తిడిని ఏఐ ద్వారా సులువుగా సమీక్షించవచ్చని నిమ్హాన్స్ డైరెక్టర్ ఆచార్య వైసీ జనార్దనరెడ్డి తెలిపారు.