గోదావరిఖనిలో కార్మిక గర్జన సభ విజయవంతంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మంచిర్యాల
ఈ నెల పద్నాలుగో తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న కార్మిక గర్జన బహిరంగ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించినట్లు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ ఏర్పాట్లు, కార్యాచరణపై చర్చించారని ఆయన తెలిపారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా అందరూ సమన్వయంతో పనిచేసి సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.