టీచర్ల జోలికొస్తే రౌడీయిజం చేసేవారి తోక కత్తిరిస్తామంటూ సీఎం చంద్రబాబు హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: కుప్పం
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీచర్ల జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, రౌడీయిజం చేసేవారి తోక కత్తిరిస్తామని హెచ్చరించారు. మెగా డీఎస్సీ నియామకాలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు.