వైరాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉన్నతీకరణకు ఎమ్మెల్యే వినతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వైరా
వైరా నియోజకవర్గంలోని సింగరేణి, ఏన్కూరు, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కోరారు. అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలంటే ఈ కేంద్రాల అప్గ్రేడ్ అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించడంతో నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.