శ్రీలంక జావెలిన్ స్టార్ రుమేష్‌ తారంగ జవెలిన్‌లు ధ్వంసం!

రిపోర్టర్: రాము స్థలం: World

ప్రపంచ నంబర్ వన్ జావెలిన్ త్రోయర్ రుమేష్ తారంగ పతిరాగే జవెలిన్‌లు ఎయిర్‌లైన్స్ ప్రయాణంలో దెబ్బతిన్నాయి. కొలంబో చేరుకున్న తారంగ తన మూడు జవెలిన్‌లు పాడైనట్లు గుర్తించారు. శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, అతనికి కొత్త జవెలిన్‌లను అందజేస్తామని, ఎయిర్‌లైన్స్‌పై పరిహారం కోసం చట్టపరమైన చర్యలు పరిశీలిస్తామని ప్రకటించింది.