మణిపూర్ సంగీత ఉపాధ్యాయుడి హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీలో మణిపూర్‌కు చెందిన సంగీత ఉపాధ్యాయుడు చోంగ్థమ్ విక్రమ్ సింగ్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. రెండు వారాల్లోగా కోర్టులో బలమైన చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని పోలీసులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.