ప్రకాశం జిల్లాలో పోలింగ్ సిబ్బందికి తిప్పలు: ఆకలితో అల్లాడిన వందలాది మంది

రిపోర్టర్: మహేష్ స్థలం: ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో అధికారుల నిర్లక్ష్యంతో పోలింగ్ విధులకు వచ్చిన వందలాది మంది సిబ్బంది ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడ్డారని అధికారులు తెలిపారు. సుమారు ఏడు వందల మంది విధుల్ లో ఉండగా కేవలం మూడొందల మందికి మాత్రమే భోజనం తెప్పించారు. సరిపడా ప్లేట్లు లేక డిస్పోజబుల్ గ్లాసుల్ లో అన్నం తింటూ సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది ఆందోళనకు దిగడంతో ఆర్వో స్పందించి దశలవారీగా భోజన సదుపాయం కల్పించారు.