అనంతపురం ఉన్మాది దాడి: విద్యార్థిని గోపిక ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి

రిపోర్టర్: హరి స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆమెకు రక్తపోటు అదుపులోకి వచ్చిందని, మూత్ర విసర్జన వ్యవస్థ మెరుగుపడిందని తెలిపింది. మరోవైపు ఇదే ఘటనలో గాయపడిన మరో విద్యార్థిని లక్ష్మికి అనంతపురం ఆసుపత్రిలో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.