రూ.11,359 కోట్లతో మున్సిపల్ అభివృద్ధి పనులను ప్రారంభించిన చంద్రబాబు

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి / కుప్పం

రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాల్టీలు మరియు కార్పొరేషన్లలో చేపట్టే అభివృద్ధి పనులను కుప్పం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా పట్టణ స్థానిక సంస్థల్లో రూ.11,359 కోట్ల భారీ వ్యయంతో వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం కానుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.