ఉద్యాన పంటలకు వర్షాలు ఎంతో అనుకూలమన్న జేవీఎస్ రాజు

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు జీడి, మామిడి, కొబ్బరి తదితర ఉద్యాన పంటలకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేవీఎస్ రాజు తెలిపారు. నేలలో తేమ పెరిగినందున రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యానశాఖ సూచించిన మోతాదులోనే ఎరువులు వినియోగించాలని సూచించారు. గ్రోమోర్ కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నందున అవసరమైన మేరకు ముందుగానే సమకూర్చుకోవాలని, అధికంగా నిల్వ చేయొద్దని కోరారు.