అమెరికాలో ఎంపిక చేసిన రాష్ట్రాల ప్రజలకు 00 డాలర్ల రీఫండ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమెరికా
అమెరికాలోని దాదాపు పది లక్షల మంది ఇళ్లకు త్వరలోనే ఐదు వందల డాలర్ల చెక్కులు రానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అఫర్డబుల్ కేర్ యాక్ట్ లబ్ధిదారులకు ఈ సొమ్ము చేరనుందని అధికారులు వెల్లడించారు. హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ పోర్టల్ నిర్వహణ కోసం ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను అర్హులైన అమెరికన్లకే తిరిగి ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ముప్పై రాష్ట్రాల ప్రజలకు మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని అధికారులు పేర్కొన్నారు.