ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: పాఠశాలల్ లో ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్కులు తప్పనిసరి

రిపోర్టర్: రాము స్థలం: ఢిల్లీ

జాతీయ రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ సుధా ఆచార్య తెలిపారు. దీపావళి తర్వాత బహిరంగ క్రీడా కార్యకలాపాలను వాయిదా వేయడంతో పాటు తరగతి గదుల్ లో ఎయిర్ ప్యూరిఫైయర్లు, స్నేక్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు పాఠశాల బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, పటాకుల వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఆదేశించింది.