ముక్కుడుపల్లి–కొర్రపాడు జంక్షన్‌కు సీసీ రోడ్డు మంజూరు చేయాలని వినతి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలం: బూదరాళ్లు గ్రామపంచాయతీ పరిధిలోని ముక్కుడుపల్లి నుంచి కొర్రపాడు జంక్షన్ వరకు 3 కిలోమీటర్ల సీసీ రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో పీజీఆర్ఎస్లో సమర్పించిన అంచనా ప్రతిని జతచేసి రోడ్డు నిర్మాణానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా కోరారు.