రామాయణ చిత్రంలో యష్ పాత్రకు గాత్రదానంపై శరద్ కేల్కర్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
రామాయణ చిత్రంలో రావణాసురుడిగా నటిస్తున్న యశ్ పాత్రకు హిందీ వెర్షన్ లో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న అనుభవమని ప్రముఖ నటుడు శరద్ కేల్కర్ వెల్లడించారు. కన్నడ యాస ప్రభావం కారణంగా హిందీ పదాల ఉచ్ఛారణలో కొంత సమస్య ఎదురైందని, అయితే యశ్ అద్భుతమైన నటన కనబరిచారని ఆయన తెలిపారు. ఇద్దరం కలిసి చర్చించుకుని సంభాషణలను మెరుగుపరిచామని, డైరెక్టర్ నితీష్ తివారీ ఈ ప్రాజెక్ట్ కోసం తనను ఎంపిక చేశారని ఆయన పేర్కొన్నారు.