ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. అనంతరం హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని ఆదేశించారు.