పసిడి ప్రియులకు భారీ ఊరట: మార్కెట్ లో కొత్త ట్రెండ్గా తక్కువ క్యారెట్ల బంగారం

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

బంగారం ధరలు ఆకాశాంటడంతో వినియోగదారుల ఆలోచనా విధానంలో వేగంగా మార్పు వస్తోందని, గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం మార్కెట్ లో తొమ్మిది, పద్నాలుగు, పద్దెనిమిది క్యారెట్ల ఆభరణాల కొనుగోళ్లకు వినియోగదారులు అమితమైన ఆసక్తి చూపుతున్నారని జ్యువెలరీ వర్తకులు స్పష్టం చేశారు. తక్కువ బడ్జెట్ లో నాణ్యమైన ఆభరణాలు లభిస్తుండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది క్యారెట్ల బంగారానికి కూడా హాల్మార్కింగ్ పరిధిలోకి తీసుకురావడంతో ప్రజల్ లో విశ్వాసం మరింత పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.