అర్హులైన వారికే నూతన పింఛన్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో నూతన పింఛన్ల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 51,722 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీలోగా భౌతిక పరిశీలన పూర్తి చేసి, సెప్టెంబర్ 24వ తేదీలోగా తదుపరి ప్రక్రియను ముగించాలని స్పష్టం చేశారు.