రాజాపేటలో ఘనంగా లక్ష ఉండ్రాల్ల ప్రత్యేక పూజలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం 11వ రోజు ప్రధాన అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో లక్ష ఉండ్రాల్ల పూజలు నిర్వహించారు. శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గణేష్ నిమజ్జనం చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.