డిజిటల్ చెల్లింపులు పెరిగినా తగ్గని కరెన్సీ నోట్ల చలామణి
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ నగదు నోట్ల చలామణి మాత్రం తగ్గలేదని ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 15 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ.43.46 లక్షల కోట్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 13.5 శాతం అధికమని, గత ఐదేళ్లలో ఇదే అత్యధిక స్థాయి అని అధికారులు పేర్కొన్నారు. రోజువారీ కొనుగోళ్లు, చిన్న వ్యాపారాల కోసం ప్రజలు ఇంకా నగదుపైనే ఆధారపడుతున్నట్లు ఈ నివేదిక తేల్చింది.