ఇందిరమ్మ ఎల్ఐజీ ఫ్లాట్ల కేటాయంపునకు నవంబరు మూడో తేదీన ఈ-లాటరీ డ్రా
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఫ్లాట్ల కేటాయంపునకు నవంబరు మూడో తేదీన డ్రా నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ వెల్లడించారు. ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్ లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ ఇ-లాటరీ ద్వారా పారదర్శకంగా ఫ్లాట్లను కేటాయించనున్నారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.