ఏపీలో 28 కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా జడ్పీలను మంజూరు చేశారు. వీటి నిర్వహణ కోసం 15 సీఈఓ, 15 డిప్యూటీ సీఈఓ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. సెప్టెంబర్ 24 తర్వాత ఈ కొత్త వ్యవస్థ అధికారికంగా అమల్లోకి రానుంది.