ఓలా ఎలక్ట్రిక్‌కు వినియోగదారుల కమిషన్ భారీ షాక్, రూ.లక్ష చెల్లించాలని ఆదేశం

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

పూర్తి డబ్బులు చెల్లించినప్పటికీ నెలల తరబడి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డెలివరీ చేయని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కమిషన్ గట్టి షాకిచ్చింది. సేవల్లో లోపం ఉన్నట్లు నిర్ధారించి, రూ.1,34,161 వాపసు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే మానసిక వేదన, జీవనోపాధి కోల్పోయినందుకు రూ.90,000, కోర్టు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని స్పష్టం చేసింది.