గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందంటూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

నాడు కబ్జాలు, కూల్చివేతలతో ప్రజలను భయపెట్టారని, నేడు తాము ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టాలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పేదలకు మేలు చేస్తుంటే ఓర్వలేక గొడ్డలి పార్టీ ఇంకా కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఎలాంటి అవకతవకలు లేకున్నా మెగా డీఎస్సీపై కొందరు విషం చిమ్ముతున్నారని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.