ప్రభాస్ ఫౌజీ సినిమా విడుదలపై మైత్రి రవి శంకర్ అప్డేట్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత మైత్రి రవి శంకర్ పాల్గొని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ అందించారు. ఈ సినిమా విడుదల కొద్దిగా వాయిదా పడుతోందని, అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అంతటి అత్యంత గ్రాండ్ లుక్లో ఈ చిత్రంలో కనిపిస్తారని ఆయన స్పష్టం చేశారు. సినిమా అవుట్పుట్ మరింత అద్భుతంగా రావడానికి కొంత సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.