భాగ్యనగరంలో భక్తులను ఆకట్టుకుంటున్న అరుదైన బంగారు గణేశుడు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

వినాయక చవితి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ బేగంబజార్‌లోని ఫీల్‌ఖానాలో కొలువుదీరిన 48 కిలోల బంగారు గణేశుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో రూపుదిద్దుకున్న ఈ దివ్య రూపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ముంబై లాల్‌బాగ్‌చా రాజా, తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి స్ఫూర్తితో ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.