రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ
రిపోర్టర్: గోపి
స్థలం: తూర్పు గోదావరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో తన వంతు భాగస్వామ్యం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనను ఆంధ్ర బిడ్డగా భావించి రాష్ట్రం కోసం ఏమి చేయాలో చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరినట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి - ఎమ్మెల్యే రాజమహేంద్రవరం రూరల్ వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీ చేసిన వ్యాఖ్యలను ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. రాయలసీమ విజయోభవ కార్యక్రమంలో భాగంగా ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.