మేడ్చల్ మల్కాజిగిరి: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వేడుకల్ లో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ
రిపోర్టర్: సునీల్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను ఘనంగా నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ స్వీకరించారని, దేశ ఐక్యత, సమగ్రత మరియు మతసామ్రాస్యం పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.