ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు: మట్ట దయానంద్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సత్తుపల్లి

సత్తుపల్లిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి అని, భావి తరాల నిర్మాణంలో వారి పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.

విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అందిస్తూ ఉపాధ్యాయులు గొప్ప సేవలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.