పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ ప్రక్రియపై అరవింద్ ధర్మపురి తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Nizamabad
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై అరవింద్ ధర్మపురి తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పుడు మీడియా కథనాలతో క్షేత్రస్థాయి వాస్తవాలను దాచలేరని ఆయన స్పష్టం చేశారు. వేలాది మంది సరిహద్దుల వైపు పారిపోతున్నారని, తొలగించిన ఓటర్ల జాబితాలో అక్రమ చొరబాటుదారుల పేర్లు వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.