కూనో నేషనల్ పార్కులో నాలుగు చీతా పిల్లలకు జన్మనిచ్చిన కేజీపీ పన్నెండు
రిపోర్టర్: సునీల్
స్థలం: మధ్యప్రదేశ్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాలో మరో అద్భుత పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కు పరిధిలో కేజీపీ పన్నెండు అనే ఆడ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చినట్లు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ప్రాజెక్ట్ చీతా ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయిన తరుణంలో భారత్ లోనే జన్మించిన ఈ చీతా మళ్లీ పిల్లలకు జన్మనివ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.