తెలుగు రాష్ట్రాల రైల్వే మార్గాల విస్తరణకు భారీ నిధులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
దక్షిణ భారతదేశంలో రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భారీ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దాదాపు 236 కిలోమీటర్ల పరిధిలో రూ. 4,178.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే రెండు బృహత్తర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రైల్వే బోర్డు అధికారిక ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉక్కు, సిమెంట్, వ్యవసాయ రంగాలు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో పారిశ్రామిక రవాణా మరింత సులువుకానుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.