టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు: నా బాధ్యత ప్రసన్నం చేసుకోవడం కాదు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

అందరినీ సంతోషపెట్టడం తన బాధ్యత కాదని, జట్టుకు సరైన నిర్ణయాలు తీసుకోవడమే తన కర్తవ్యమని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. న్యూజిలాండ్ తో జరగనున్న ఐదో టీ20 మ్యాచ్ కు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుదీర్ఘకాలం పాటు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడమే ప్రతి ఆటగాడికి అసలైన స్ఫూర్తి అని ఆయన తేల్చిచెప్పారు.