ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాలంటూ అభిజీత్ దీప్కే డిమాండ్

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సీఈసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ వైఖరిపై ఇతర కమిషనర్లు విభేదించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. రాజీనామా చేయకపోతే జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు.