నిర్మల్ వేదికగా భారీ రైతు గర్జన సభ: ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్

రిపోర్టర్: రాము స్థలం: నిర్మల్

ఈ నెల 11వ తేదీన నిర్మల్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు గర్జన సభ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించినట్లు నాయకులు తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు మూడు నియోజకవర్గాల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, అవసరమైన అన్ని సన్నాహాలను ముమ్మరం చేశామని నిర్మల్ నాయకులు వెల్లడించారు.