విమానంలో హైడ్రామా: కాక్పిట్లో కెప్టెన్పై కో-పైలెట్ దాడి కలకలం

రిపోర్టర్: రమేష్ స్థలం: తబూక్

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ప్లైదుబాయ్ విమానంలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్పై కో-పైలెట్ దాడి చేసినట్లు భారత ఎంబసీ వెల్లడించింది. తీవ్ర గాయాలపాలైనప్పటికీ కెప్టెన్ సాహసంగా కాక్పిట్ డోర్ తెరిచి పెను ప్రమాదం తప్పించారని అధికారులు తెలిపారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్లో అత్యవసరంగా ల్యాండ్ చేశామని, కో-పైలెట్ను అదుపులోకి తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.