ఎన్నికల సంఘంపై ఆరోపణలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Telangana
ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దీనికి వారు ముందుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ తెలంగాణ స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని కించపరుస్తూ, వారి నిర్ణయాలను బీజేపీకి ఆపాదించే ఇటువంటి చీప్ పాలిటిక్స్ ను కాంగ్రెస్ తక్షణమే మానుకోవాలని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ లబ్ధికోసమే అవాస్తవ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.